నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్​ రాహుల్​రాజ్​

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​ రాజ్​తెలిపారు. సోమవారం ఆర్డీవో రమాదేవి, మున్సిపల్​ చైర్మన్​చంద్రపాల్​ కలిసి కోంటూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. నిమజ్జన విధుల్లో అధికారులు అలర్ట్​గా ఉండాలని ఆదేశించారు. పట్టణంలో నిమజ్జనానికి 3  క్రేన్లు, 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

ప్రజాపాలనకు ఏర్పాట్లు

ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి  పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​రాజ్​తెలిపారు. మెదక్​ కలెక్టరేట్​లో వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్  కోదండరెడ్డి ముఖ్య అతిథిగా వస్తారన్నారు.

ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు,  సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో రమాదేవి. కలెక్టరేట్ ఏవో యూనస్, తహసీల్దార్​లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు.