మెదక్‌టౌన్, వెలుగు : అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్సూచించారు. శుక్రవారం ఆయన హవేలీ ఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ..జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పని తీరు ఆదర్శంగా ఉందన్నారు. అనంతరం పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించి వారికి అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు.
పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. స్కూల్పరిసరాలలోని డ్రింకింగ్ వాటర్, కిచెన్ షెడ్, ఇతర సౌకర్యాలను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.