
- మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని తప్పకుండా తనిఖీ చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పరిధిలోని చిన్నశంకరంపేట, రామాయంపేట మండలంలోని అక్కన్నపేట వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ టీమ్ పోలీస్ చెక్‌పోస్టును మెదక్ ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్రాజ్అక్కడున్న వారికి పలు సలహాలు, సూచనలు చేసి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాల్సిందిగా సూచించారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.