![స్టూడెంట్స్ చదువుపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rahul-raj-inspects-burugupalli-zp-high-school_9my8J5NnoW.jpg)
- బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్ చదువుపై దృష్టి పెట్టాలని, సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్సూచించారు. శుక్రవారం ఆయన హవేలీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్స్, కిచెన్ పరిశీలించి స్టూడెంట్స్‌తో మాట్లాడారు. వారికి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ పాఠాలను బోధించారు. టెన్త్స్టూడెంట్స్ను సిలబస్ రివిజన్ చేశారా లేదా అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని టీచర్లకు సూచించారు. ఇంటివద్ద తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు. కలెక్టర్ వెంట హెడ్మాస్టర్, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ పనులను పూర్తి చేయాలి
జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధిపనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్రాహుల్రాజ్అధికారులకు సూచించారు. మెదక్ కలెక్టరేట్లో రామాయంపేట మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖలకు సంబంధించిన వివిధ దశల్లో ఉన్న పనులను అధికారులు పరిశీలించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు.