పక్కాగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : కలెక్టర్ రాహుల్ రాజ్

పక్కాగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : కలెక్టర్ రాహుల్ రాజ్

చిన్నశంకరంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా జరుగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని  మాందాపూర్ లో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులకు లబ్ధి చేకూరేలా యాప్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తారని, విడతల వారీగా ఇది కొనసాగుతుందని చెప్పారు.

రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తు న్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించారు. ఆన్​లైన్​లో ఎన్ని అప్లోడ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట  ఎంపీడీవో దామోదర్, జీపీ సెక్రటరీ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెస్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలి

మెదక్​టౌన్: మెస్​ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహణపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో  పకడ్బందీగా కార్యక్రమం చేపట్టాలన్నారు. రాజకీయ నాయకులు, స్టూడెంట్స్​తల్లిదండ్రులు స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త  డైట్ ప్రకారం ఆహార పదార్థాలను రెడీ చేయాలన్నారు.