హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

కౌడిపల్లి, వెలుగు: వెల్ఫేర్​హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ఇడ్లీ తిని, 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో బుధవారం కౌడిపల్లి బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. బాత్రూంలు, వంట గది, విద్యార్థినుల గదులు, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. జిల్లాలో 105 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలున్నాయని, మెనూ పకడ్బందీగా అమలవుతోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్, మెస్ చార్జీలు పెంచినా మెయింటెనెన్స్ విషయంలో వార్డెన్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వైద్యం అందేలా డాక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్​ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి పద్మజ, డాక్టర్ స్వర్ణజ్, హెల్త్ సూపర్​వైజర్ రమేశ్, సిబ్బంది ఉన్నారు.