చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఇరిగేషన్​అధికారులను ఆదేశించారు. సోమవారం వనదుర్గా ప్రాజెక్ట్​ నుంచి సాగునీరందించే మహబూబ్​నహర్​కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 4.06 టీఎంసీల సాగునీరు వనదుర్గా ప్రాజెక్టుకు అలిగేషన్ ఉందన్నారు. జనవరి 15 నుంచి ఏప్రిల్-చివరి వరకు సాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్స్​లో ఏఐ పక్కాగా అమలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కార్యక్రమాన్ని ప్రభుత్వ స్కూల్స్​లో పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్​రాహుల్​రాజ్​ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో డీఈవో రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏఐ సాఫ్ట్​వేర్​ రూపొందించిన బెంగళూరు బృందంతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో సాఫ్ట్​వేర్​సమస్యలను నివృత్తికి  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏఐ సాఫ్ట్​వేర్​బృంద సభ్యులు అనంతి ఆకాశ్,  ప్రీతి ఉన్నారు.