రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​రాజ్​

రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​రాజ్​

టేక్మాల్, వెలుగు: ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హుల గుర్తింపుకోసం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను సోమవారం టేక్మాల్​లో కలెక్టర్ రాహుల్​రాజ్​తనిఖీ చేశారు. అనంతరం గ్రామ సభల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్​మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా చదివి వినిపించి తుది జాబితా తయారు చేయాలన్నారు.