
పాపన్నపేట, వెలుగు: రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ స్పీడప్చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ఉన్న పౌరసరఫరాల శాఖ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ (గోడౌన్) ను పరిశీలించారు. నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అంగన్వాడీ సెంటర్స్, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీకి సరిపడే బియ్యం స్టాక్ ఉండే విధంగా సివిల్ సప్లై శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.