- స్టూడెంట్లలో శాస్త్రీయ దృక్పథం పెంపొదించడమే లక్ష్యం
- కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక శ్రద్ధ
మెదక్, వెలుగు: జిల్లాలోని సర్కార్బడుల్లో చదివే స్టూడెంట్లలో సైన్స్, మ్యాథ్స్ నైపుణ్యాలు పెంచేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అమలు చేయిస్తున్నారు. స్టూడెంట్లలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యం. ఈ మేరకు ఆయా స్కూళ్లలో పనిచేసే సైన్స్, మ్యాథ్స్ టీచర్లకు గ్రౌండ్ బేస్ లెర్నింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా సర్కార్బడుల్లో చదివే స్టూడెంట్స్సైన్స్, మ్యాథ్స్సబ్జెక్టుల్లో ఆశించిన విధంగా నైపుణ్యం సాధించలేకపోతున్నారు. పరీక్షలలో పాస్ కావడం కోసం బట్టి చదువులకు పరిమితమవుతున్నారు.
తద్వారా పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో వెనకబడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్లలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం కోసం ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించేలా సాధారణ పద్దతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానం అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు 20 అంశాలతో గ్రౌండ్ బేస్ లెర్నింగ్కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలను గ్రౌండ్ లెవెల్ లో స్టూడెంట్లతో అమలు చేయిస్తారు. తద్వారా సబ్జెక్ట్బాగా అర్థం చేసుకుని నాలెడ్జ్కలిగిన స్టూడెంట్లుగా తయారవుతారు. జిల్లాలోని వివిధ మండలాల్లోని 160 సర్కార్బడుల్లో చదివే 35 వేల మంది స్టూడెంట్స్‌కు గ్రౌండ్ బేస్లెర్నింగ్పద్దతిలో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్సైన్స్, మ్యాథ్స్సబ్జెక్టులపై పట్టు సాధించేలా కార్యక్రమాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
శాస్త్రీయ వైఖరి పెంపొందించడం కోసం
ప్రతి స్టూడెంట్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విధంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం అమలుపై ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు శిక్షణ ఇచ్చాం. పునాది గట్టిగా ఉంటే తరగతుల్లో, వారు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవుతారు. ప్రతి టీచరు క్రియేటివ్ గా ఆలోచించి పిల్లలకు వివిధ సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్యను అందించేలా కార్యక్రమాన్ని రూపొందించాం. శిక్షణలో నేర్చుకున్న అంశాలను స్కూల్‌స్థాయిలో స్టూడెంట్స్‌కు అర్థమయ్యే రీతిలో బోధించాలి. - కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రత్యక్ష అనుభవం ఏర్పడుతుంది
సైన్స్, మ్యాథ్స్సబ్జెక్టుల్లో స్టూడెంట్స్ మెరుగుపడాలంటే క్లాస్రూమ్అభ్యసనాన్ని బడి బయట ప్రయోగాలతో అనుసంధానం చేయాలి. అప్పుడు స్టూడెంట్లలో ప్రత్యక్ష అనుభవం ద్వారా సబ్జెక్ట్బాగా అర్థమవుతుంది. తద్వారా నిజ జీవితంలో సందర్భోచితంగా అన్వయించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనించే కలెక్టర్గ్రౌండ్ బేస్ లెర్నింగ్అనే కార్యక్రమాన్ని రూపొందించి జిల్లాలోని అన్ని హై స్కూళ్లలో అమలు చేయిస్తున్నారు.
రాజిరెడ్డి, జిల్లా సైన్స్ఆఫీసర్