ఎన్నికల ఓటర్‌‌ స్లిప్స్ పంపిణీ చేయాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

ఎన్నికల ఓటర్‌‌ స్లిప్స్ పంపిణీ చేయాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

మెదక్​, వెలుగు: ఓటు హక్కు కలిగిన గ్రాడ్యుయేట్స్​, టీచర్లకు ఓటర్​స్లిప్​లు పంపిణీ చేయలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ సింధు రేణుక గురువారం క్యాంప్​ ఆఫీస్​లో కలెక్టర్​ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్​ స్లిప్​ అందజేశారు.

ఔరంగాబాద్ లోని  పోలింగ్ స్టేషన్ నెంబర్ 428 లో  కలెక్టర్ కు ఓటు హక్కు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్​ ప్రకారం ఓటర్‌‌ స్లిప్స్‌‌ పంపిణీ పూర్తయిన తర్వాత రిపోర్టు సమర్పించాలని సూచించారు. 

డాక్టర్లు అందుబాటులో ఉండాలి

చేగుంట: డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. చేగుంట పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రి నిర్వహణ తీరును పరిశీలించారు. డాక్టర్లతో, రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. 

 పొలాల పరిశీలించిన కలెక్టర్

చిన్నశంకరంపేట: కలెక్టర్ ​రాహుల్​రాజ్​ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్న శంకరంపేట్ గ్రామ శివారులో నరసింహులు అనే రైతు సాగు చేసిన పొలాలను సందర్శించారు. పొలం గట్లపై నడుస్తూ ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు, పెట్టుబడి ఎంతవుతుంది,  తెగుళ్లకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దిగుబడులు వస్తున్నాయా, సాగు నీటి వసతి ఎలా ఉంది, విద్యుత్ సమస్యలు ఉన్నాయా  అని  రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏఈవోలు పొలాలను పరిశీలించి రైతులకు తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించాలన్నారు.