- మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు
మెదక్టౌన్, వెలుగు : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ప్రజావాణి అని కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో అడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లు తో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ..
ప్రజావాణికి136 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఇందులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 18, ధరణి, భూ సమస్యలు-36, పింఛన్లు 8, రుణమాఫీ-7, ఇతర సమస్యల గురించి -67 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. అధికారులు వెంటనే వీటిని పరిష్కరించాలని సూచించారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్ : ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో ప్రజావాణి సందర్భంగా అడిషనల్కలెక్టర్లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రజావాణికి మొత్తం 55 వినతులు రాగా అందులో రెవెన్యూకి సంబంధించి 33 ఇతర శాఖలకు సంబంధించి 22 ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ ,మాధురి, డీఆర్వో పద్మజారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట టౌన్ : ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించి నివేదిక అందించాలని అడిషనల్కలెక్టర్గరిమా అగర్వాల్అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధిత, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు మొత్తం కలపి 30 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.
కాగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు రావడం లేదని సిద్దిపేట జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు అడిషనల్కలెక్టర్కు వినితపత్రం అందించారు. డీఆర్వో నాగ రాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు.