- కలెక్టర్ రాహుల్ రాజ్
- సంగారెడ్డిలో ప్రత్యేక ఓటర్క్యాంపెనింగ్: కలెక్టర్ క్రాంతి
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే డాటాఎంట్రీని పక్కాగా నిర్వహించాలని, ఇప్పటి వరకు 91.31శాతం సర్వే పూర్తయిందని కలెక్టర్ రాహుల్రాజ్తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ఆఫీసు నుంచి సర్వే డాటా ఎంట్రీపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కుటుంబ సర్వే తుది దశకు చేరుకుందని, డాటా ఎంట్రీపై కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు డాటా ఎంట్రీ నిర్వహణకు సహకరించాలన్నారు. 369 కంప్యూటర్ ఆపరేటర్లను నియమించామని తెలిపారు.
స్టూడెంట్స్‌కు గ్రౌండ్బేస్ లెర్నింగ్ అవసరం
ప్రతి స్టూడెంట్‌కి శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విధంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ అవసరమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్‌కలెక్టరేట్ లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పై ప్రభుత్వ టీచర్లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రౌండ్ బేస్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్స్వారు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవుతారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్‌కు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నారు. గ్రౌండ్ బేస్ లెర్నింగ్ కార్యక్రమాన్ని 20 అంశాలతో రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, డీఎస్వో రాజిరెడ్డి, ఎంఈవోలు, టీచర్లు పాల్గొన్నారు.
నేడు, రేపు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్
సంగారెడ్డి టౌన్: ఓటరు నమోదు స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ నెల 23, 24న ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ క్రాంతి శుక్రవారం తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఎన్నికల సిబ్బంది ఓటర్ నమోదు దరఖాస్తుల స్వీకరిస్తారని పేర్కొన్నారు.
2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు కోసం అప్లై చేసుకోవాలన్నారు. నూతన ఓటరు నమోదు, తప్పుల సవరణ, అడ్రస్ మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు దరఖాస్తులు సైతం స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్ ను కలిసిన టీజీవో కొత్త కమిటీ
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం క్యాంప్ఆఫీసులో కలెక్టర్ క్రాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వైద్యనాథ్, సంతోష్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ బలరాం, శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పర్వతాలు, జితేందర్ రెడ్డి, శ్రీ వాణి, జాయింట్ సెక్రటరీలు రాజిరెడ్డి, నజీర్ పాషా, హేమలత, ట్రెజరర్ ప్రసాద్, శిరీష, ప్రవీణ్ చారి, సురేశ్ ఉన్నారు.