
- కలెక్టర్లు రాహుల్‌రాజ్, మనుచౌదరి, క్రాంతి
మెదక్‌టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్కలెక్టరేట్లో డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 85 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
వీటిలో ధరణి సమస్యలు-30, పెన్షన్-3, ఇందిరమ్మ ఇండ్లు 3, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలు-47 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 15 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సంబంధిత పీఎస్‌లకు ఫోన్‌చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సిద్దిపేట టౌన్: బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి దోహదం చేస్తుందన్నారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు కలిపి మొత్తం 71 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 69 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖ 25, పౌర సరఫరాల 2, సర్వే ల్యాండ్ 3, పంచాయతీ అండ్ పీటీ విభాగం 7, పంచాయతీ రాజ్ 4, డీఆర్డీవో 3, మున్సిపల్ 10, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, విద్యాశాఖ 2 , వ్యవసాయ శాఖ3, పశువైద్య శాఖ 2, వైద్య ఆరోగ్యశాఖల నుంచి 3 దరఖాస్తులు అందాయి. గ్రీవెన్స్ లో అడిషనల్కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజారాణి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి , ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.