మెదక్ జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక హెల్త్​క్యాంపు : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్ జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక  హెల్త్​క్యాంపు : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు : జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజావాణికి 65 అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా కలెక్టర్  స్వయంగా వారి వద్దకు వెళ్లి దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల  ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోగా సంబంధిత ఎంపీడీవో ఆఫీసులో తెలియజేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు సూచించారు. కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ నగేశ్, డీపీవో యాదయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో  సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 491 గ్రామ పంచాయతీలు, 4,210 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 4,210 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని కలెక్టర్​ తెలిపారు. సమావేశంలో బీఆర్​ఎస్​ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

మెడికల్ కాలేజీ లో తరగతులు ప్రారంభం 

మెదక్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్​ఫస్ట్ ఇయర్ ప్రత్యక్ష తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్​రాహుల్​రాజ్​మెడికల్ కాలేజీ, హాస్టల్​ను పరిశీలించారు.