ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు : రాహుల్ ​రాజ్​

  • కలెక్టర్​ రాహుల్ ​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్​ రాహుల్ ​రాజ్​తెలిపారు. శనివారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మెదక్​ పట్టణంలోని బాలుర జూనియర్​ కాలేజీ మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరువచేస్తున్నామన్నారు. స్టూడెంట్స్​మత్తు పదార్థాలకు బానిస కాకుండా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నిర్మూలించేందుకు వాహనదారులకు పోలీస్ కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువత ఉన్నత చదువులు చదివి భవిష్యత్​కు మంచి మార్గం వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​నృత్యాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్  విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

 గ్రామీణ అభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, ఏఎస్పీ మహేందర్, మున్సిపల్ చైర్మన్​చంద్రపాల్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.