- మెదక్ కలెక్టర్రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్జిల్లాలో టీబీ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్రాహుల్రాజ్తెలిపారు. బుధవారం జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముప్పారంలో జరుగుతున్న నిక్షయ్ శిబిరాన్ని జాతీయ టీబీ సభ్యుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీబీ నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు.
ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలను వివరించగా బృందం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మెదక్ జిల్లా ఆస్పత్రిలో టీబీ నాట్సెంటర్ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డీఎమ్అండ్ హెచ్‌వో శ్రీరామ్, జాతీయ టీబీ టీమ్బాధ్యులు డాక్టర్లు సంజీవ్ చౌహన్, అభిషేక్, విష్ణు రాజేశ్వరి, జిల్లా టీబీ అధికారి నవీన్ కుమార్, అల్లాదుర్గం వైద్యాధికారిణి సారిక తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
మహిళలు ఆర్థికంగా ఎదిగి ఉన్నత స్థితికి చేరుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్రాహుల్రాజ్తెలిపారు. కలెక్టరేట్ఆవరణలో ---ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాన్ని నార్సింగి మండలానికి చెందిన కళ్యాణికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మీ-సేవ, పౌల్ట్రీ, నాటు కోళ్ల పెంపకం, క్యాంటీన్లు , ఇతర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఈ సంవత్సరానికి రూ.100 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని మహిళలకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య , డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.