మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ కృషి : కలెక్టర్ రాహుల్​ రాజ్​

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ కృషి :  కలెక్టర్ రాహుల్​ రాజ్​

మెదక్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. గురువారం ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా టీఎస్​ఆర్టీసీ ఆధ్వర్యంలో మెదక్ న్యూ బస్టాండ్ ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఆధార్ కార్డు ద్వారా 1.60 కోట్ల మంది జీరో టికెట్లతో ప్రయాణం చేసి రూ.53 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు. రవాణా శాఖ మంత్రి ఆదేశించిన విధంగా మహిళా శక్తి రుణాలు మంజూరు చేసి వారితో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 

మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల పాలిట వరమన్నారు. ఎంతోమంది మహిళలు, బాలికలు నిత్యం బస్సులలో ప్రయాణించి లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ డీఎం సురేఖ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు లేని విధంగా గ్రౌండ్ హెల్త్ పాలసీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో మెదక్ జిల్లాకు పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్​నాయకులు ఎంఆర్​కే రావు, పీఎస్ రెడ్డి పాల్గొన్నారు. 

 మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా నడుస్తున్న నాటు కోళ్ల పరిశ్రమను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా క్యాంటీన్లు, క్యాటరింగ్, మీసేవ సెంటర్లు  ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు  తీసుకుంటున్నట్లు  తెలిపారు. కార్యక్రమంలో  డీఆర్డీవో​శ్రీనివాస్ రావు, అడిషనల్ డీఆర్డీవో సరస్వతి, డీపీఎం ప్రకాశ్, ఎంపీడీవో ఆనంద్​ తదితరులు పాల్గొన్నారు.