
చిలప్ చెడ్, పాపన్నపేట, టేక్మాల్, వెలుగు: మనిషికి ఆధార్ఎలాగో భూమికి భూధార్ ఉండాలని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. సోమవారం ఆయన చిలప్ చెడ్, టేక్మాల్ మండల రైతు వేదికల్లో, పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. భూ సమస్యలు తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ధరణి పోర్టల్లో పరిష్కారం కాని అనేక సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారమవుతాయన్నారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
తహసీల్దార్ స్థాయిలో న్యాయం జరగదని భావిస్తే ఆర్డీవో, కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. రైతులకు పవర్పాయింట్ప్రజంటేషన్ద్వారా చట్టంలోని అన్ని వివరాలను తెలియజేశారు. అనంతరం ఎల్లుపేటలో ఇటీవల మంజూరైన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, ఆర్డీవోలు మహిపాల్ రెడ్డి, రమాదేవి, ఏడీఈ పుణ్యవతి, ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు