సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • 24 గంటలు అందుబాటులో ఉండాలి
  • ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేసిన కలెక్టర్లు రాహుల్​రాజ్, క్రాంతి


నర్సాపూర్, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్  ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మూడు జ్వర కేసులు మాత్రమే ఉన్నాయని అవి కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

మెడికల్​కాలేజీ ఏర్పాట్ల పరిశీలన ​ 

మెదక్: పట్టణ శివారులోని పిల్లి కొట్టాల్​లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గవర్నమెంట్​మెడికల్​కాలేజీని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో  కలిసి సందర్శించారు. ఆయా డిపార్ట్​మెంట్లు,​ క్లాస్​ రూమ్స్​, ల్యాబ్​లు, తదితర వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తామన్నారు. ఆయన వెంట డీసీహెచ్​స్​అండ్​ఎంసీహెచ్​సూపరింటెండెంట్ శివ దయాల్, మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్, అధికారులు ఉన్నారు.

జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​క్రాంతి మంగళవారం ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ప్రతిరోజూ ఎంతమంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా చేరుతున్నారు, తదితర వివరాలను సూపరింటెండెంట్ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలించి డెంగ్యూ రోగులను పలకరించి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు.

చాలా మంది వైద్యం సక్రమంగా అందడం లేదని, వైద్యులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేయడంతో సిబ్బందిపై కలెక్టర్​అసహనం వ్యక్తం చేశారు. జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలని సూచించారు. సీజనల్​ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రిలో  24 గంటలు అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్​ను ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డీటీ మధుకర్ రెడ్డి , సంబంధిత అధికారులు ఉన్నారు.