నార్మల్​ డెలివరీలను పెంచాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

నార్మల్​ డెలివరీలను పెంచాలి :  కలెక్టర్ ​రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: గవర్నమెంట్​హాస్పిటల్స్​లో నార్మల్​డెలివరీలను పెంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని  మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలతో మాట్లాడారు. హాస్పిటల్​లో  ప్రసవాల తీరును తెలుసుకున్నారు. 

పేషెంట్లకు వసతి సౌకర్యం సరిపోవడం లేదని గుర్తించి అదనపు వసతి ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్​ను ఆదేశించారు. పిల్లల వార్డును పరిశీలించి డాక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్​ వెంట సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, ఆర్ఎంవో కిరణ్, సిబ్బంది ఉన్నారు. 

  • మెడికల్​కాలేజీ పరిశీలన 

మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్​లోని గవర్నమెంట్​మెడికల్​కాలేజీని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. కాలేజీలో అవసరమైన సదుపాయాలు, డాక్టర్లు, సిబ్బంది కోసం నోటిఫికేషన్​ రిలీజ్​ చేయాల్సిందిగా సూపరింటెండెంట్​ను ఆదేశించారు. 2024–--25 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.