అందరినీ సమానంగా చూడాలి : కలెక్టర్ రాహుల్​రాజ్​

అందరినీ సమానంగా చూడాలి : కలెక్టర్ రాహుల్​రాజ్​
  • కలెక్టర్ రాహుల్​రాజ్​

మనోహరాబాద్, వెలుగు: కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని కలెక్టర్​రాహుల్​రాజ్ అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం, సామరస్యం చాలా అవసరమని పేర్కొన్నారు. కుల బహిష్కరణ నేపథ్యంలో మండలంలోని గౌతోజిగుడలో సోమవారం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి, ఏ వృత్తినైనా చేపట్టవచ్చన్నారు.

రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాల రాస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకమన్నారు. ఇందుకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయన్నారు. వారివెంట ఆర్డీవో జయచంద్రారెడ్డి ఉన్నారు.  

 మెడికల్​కాలేజీ పనుల పరిశీలన​

మెదక్: పట్టణ శివారు పిల్లి కొట్టాల్​మెడికల్​కాలేజీ ఏర్పాటు పనులను కలెక్టర్​రాహుల్ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించాలని ప్రిన్సిపాల్​రవీందర్​కు సూచించారు. పనులు స్పీడప్​చేసి నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు.