రాజీవ్ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రాజీవ్ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం ఆయన రామాయంపేట మున్సిపల్ కేంద్రంలోని మీసేవా కేంద్రాలను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. నిరుద్యోగ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రజిని ఉన్నారు. అనంతరం నార్సింగి పీహెచ్​సీని సందర్శించి  ఓపీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో అన్ని పీహెచ్​సీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు  చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్వేక్షిస్తున్నామన్నారు. ఇన్ పేషెంట్ వసతుల విషయంలో బెడ్లు, బెడ్ షీట్లు, మరుగుదొడ్లు లాంటివి మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం క్లస్టర్ వారీగా తీసుకుని హెడ్ క్వార్టర్ లో ఉండే మహిళలే కాకుండా సుదూర ప్రాంత మహిళలకు కూడా ఈ సదుపాయం అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

ఎల్ఆర్ఎస్​ క్రమబద్ధీకరణ స్పీడప్​ చేయాలి

మెదక్​ టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్​ క్రమబద్ధీకరణ ప్రక్రియ స్పీడప్​ చేయాలని, దరఖాస్తుదారులు 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మెదక్​కలెక్టరేట్ లో​ ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు పూర్తిస్థాయి రుసుమును చెల్లించి ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, 31లోగా రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, డీఆర్డీవో​పీడీ శ్రీనివాస్​రావు, ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మీ, డీఐవో  ప్రభాకర్ పాల్గొన్నారు.