ఆదిలాబాద్ టౌన్, వెలుగు : పరిశ్రమల స్థాపనలతో ఆదిలాబాద్జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని డబ్ల్యూ కన్వెన్షన్ హాల్ లో బీడీఎన్టీ కంపెనీ ఆధ్వర్యంలో సీఐఐ తెలంగాణ రోడ్ షో, యువత, పారిశ్రామిక వేత్తలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతో, ఐటీ కో-కన్వీనర్ రామకృష్ణ, సభ్యుడు సంయుద్దీన్, బీడీఎన్టీ ఎండీ సంజీవ్ దేశ్పాండే, డీసీసీబీ చైర్మన్అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు.