ప్రజాపాలన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​

ప్రజాపాలన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి  :  కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​కలెక్టర్​ఆఫీసులో ఏర్పాటు చేసే ప్రజాపాలన కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాహుల్​రాజ్ ​సూచించారు. శనివారం ఆయన కలెక్టరేట్​లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వివిధ సమస్యల గురించి కలెక్టరేట్​కు వచ్చే వారికోసం ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 

ఆరు గ్యారంటీల దరఖాస్తుల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేయించుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రజాపాలన కేంద్రం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట గుర్తింపు పత్రాలను తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డీపీవో యాదయ్య, ఈ -డిస్టిక్ మేనేజర్ సందీప్, జిల్లా పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు. 

  •  రామాయంపేటలో..

రామాయంపేట: రామాయంపేటలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ కాంప్లెక్స్​ నిర్మించనున్నట్టు కలెక్టర్​ రాహుల్​రాజ్​ తెలిపారు. అధికారులతో కలిసి రామాయంపేటలో  పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. 

20 ఎకరాలు అవసరం ఉన్న మేరకు ఎక్కడ అనువుగా ఉంటే ఆ స్థలానికి సంబంధించి  ప్రతిపాదనలు రెడీ చేయాలని తహసీల్దార్ రజని, ఆర్ అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్ కు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని సంక్షేమ శాఖలు స్టూడెంట్స్​కు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లయితే సౌకర్యాలు కల్పన సులభతరం అవుతుందన్నారు. అనంతరం వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా చేసి  ప్రమాదాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట  బైపాస్ లో ప్రమాదాలు జరిగే  స్థలాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు  పలు 
సూచనలు చేశారు.