మెదక్‌టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. మంగళవారం ప్రజాపాలన కళాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7- వరకు జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు, 21 మండలాల్లోని ఆయా గ్రామాల్లో పథకాలపై ప్రచారం చేస్తామని చెప్పారు.
ఇందుకోసం పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో ప్రత్యేకంగా ఓ వాహనాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 1.50 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో రామచంద్ర రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డీఎంసురేఖ, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
మెదక్ మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్రాహుల్ రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు భవనాన్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కాలేజీ ల్యాబ్, హాస్టళ్లలోఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల పనులు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ నీరు కాలేజీకి వచ్చేలా చూడాలన్నారు.
స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారని డిసెంబర్ నుంచి క్లాసులు ప్రారంభించాలన్నారు. ఈనెల 25 లోపు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కమలాదేవి ఉన్నారు.