- బేటీ బచావో బేటీ పడావో సమర్ధవంతంగా అమలుచేయాలి
- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: ఇంటర్ప్రాక్టికల్స్కు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం మెదక్‌కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లాలో ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్స్టూడెంట్స్కు ప్రాక్టికల్స్ప్రారంభమవుతాయని, నాలుగు విడతల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. మొత్తం 12,484 మంది స్టూడెంట్స్ప్రాక్టికల్స్కు హాజరవుతారని పేర్కొన్నారు. బేటీ బచావో -బేటి పడావో కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందన్నారు.
మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోస్టర్స్ ఆవిష్కరించి సిగ్నేచర్ క్యాంపు ఏర్పాటు చేశారు. బాలిక విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ కింద జిల్లాలో ఎగుమతి అవకాశాలను పెంపొందించేందుకు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్పాల్గొన్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రతినిధి శైలజ, డీడీ సుధీర్ పాల్, ఇండస్ట్రీస్ జీఎమ్ ప్రకాశ్‌రావుతో కలిసి డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ యాక్షన్ ప్లాన్ (డీఈఏపీ)ని ఆమోదించడంపై సమీక్షించారు. అడిషనల్కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీడబ్ల్యూవో హైమావతి, డీఎం హెచ్‌వో శ్రీరామ్, డీఈవో రాధాకిషన్, డీఐవో మాధవి, డీపీవో యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.