
మెదక్టౌన్, వెలుగు: గురుకులాల్లోని స్టూడెంట్స్కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం ఆయన హవేలీ ఘనపూర్ మండలం కేంద్రంలోని మహాత్మా గాంధీ, జ్యోతిభాపూలే స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీచర్లు, సిబ్బంది హాజరు, సరుకుల స్టాక్, అకౌంట్ రిజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. వంటల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం 9వ తరగతి స్టూడెంట్స్తో మాట్లాడారు. వెనుకబడి ఉన్న స్టూడెంట్స్పై శ్రద్ధ చూపాలని టీచర్లకు సూచించారు. కలెక్టర్ వెంట టీచర్లు, సిబ్బంది ఉన్నారు.