- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యమివ్వాలని, జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గ్రామ సభల నిర్వహణకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి , డీపీవో యాదయ్య, డీఏవో వినయ్, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎన్డీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ఎంవోలు, మండల ప్రత్యేక అధికారులు, సర్వేయర్లు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.