మెదక్టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. మంగళవారం మెదక్కలెక్టరేట్లో వివిధ మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ..రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్చేయాలన్నారు.
జిల్లాలో మూడు వేల ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ధరణి దరఖాస్తులను తిరస్కరించినట్లయితే అందుకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలన్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.