
మెదక్టౌన్, వెలుగు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధరకే అమ్ముకోవాలని కలెక్టర్రాహుల్రాజ్ సూచించారు. ఆదివారం ఆయన మెదక్, మాచవరం ఫ్యాక్స్కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
గ్రేడ్-ఏ రకానికి రూ.2,203, గ్రేడ్-బి రకానికి రూ.2,183. మద్దతు ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో బుక్స్ నిర్వహణ, గన్నీ బ్యాగులు, రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఏ విధంగా తీసుకురావాలో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకొని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.