మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ‘స్వచ్ఛదనం– పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు మెదక్ మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని సూచించారు.
హవేళీ ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా మార్గమధ్యంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, కమిషనర్ జానకీ రామ్ సాగర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.