మాతా శిశు మరణాలను నియంత్రించాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

మాతా శిశు మరణాలను నియంత్రించాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

 మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా డాక్టర్లు, ఏఎన్ఎంలు​పనిచేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టర్ ఆఫీసులో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..  గర్భిణీలు పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివరాలు నమోదు చేసుకొని మందులు, పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

పీహెచ్​సీల పరిధిలో ఒక్క మరణం సంభవించకూడదని ఆదేశించారు. గత మూడు నెలలతో పోలిస్తే జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని ఇందుకు డాక్టర్లు, సిబ్బంది, ఆశ కార్యకర్తల కృషి కారణమన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు.

కలెక్టర్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ రోజు23 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్​వో శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్​వో నవీన్, డాక్టర్లు​జ్ఞానేశ్వర్, సృజన, రోహిణి, ఏఎన్ఎంలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

పొలాలను పరిశీలించిన కలెక్టర్​

పాపన్నపేట: నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులకు సూచించారు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్, శానాయపల్లి, పొడ్చన్​పల్లిలోని  ఎఫ్ఎన్​ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు.