
- ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్
మెదక్ టౌన్, వెలుగు: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌రాహుల్‌రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మెదక్‌పట్టణంలోని గోల్కొండ వీధి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎంహెచ్‌వో శ్రీరామ్‌కు ఫోన్‌చేసి విధులకు గైరాజరైన మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ నర్సును సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అప్పుడే ప్రజలు నమ్మకాన్ని
చూరగొంటారన్నారు.
ఉపాధి పనులు సక్రమంగా జరిగేలా చూడాలి
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలంలోని పర్వతాపూర్, కాట్రియాల గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కాట్రియాలలోని జడ్పీ హైస్కూల్, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి స్టూడెంట్స్ తో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని, మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో షాజొద్దీన్, పంచాయతీ సెక్రటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.