నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : రాహుల్​ రాజ్​

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : రాహుల్​ రాజ్​
  • కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు:  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ రాహుల్​రాజ్​ తెలిపారు. గురువారం మెదక్​కలెక్టరేట్ లో​ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ అవుతుందని, నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి,10, స్క్రూటినీ 11, నామినేషన్ల విత్​డ్రా 13,  పోలింగ్ 27న జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న ప్రారంభమమై 8 లోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. టెలీకాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, డీఆర్డీవో​శ్రీనివాసరావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు , ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

పోలింగ్​బూతుల పరిశీలన

పాపన్నపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం  పాపన్నపేట హైస్కూల్​లో రెండు గదులను ఎంపిక చేసినట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​ తెలిపారు. గురువారం వాటిని పరిశీలించి తరగతి గదులను చెక్​చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్​కు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. టీచర్ల బోధన తీరును పరిశీలించి అభినందించారు .ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, హెచ్​ఎం మహేశ్, టీచర్ల 
ఉన్నారు.