ఎంజేపీ స్కూల్లో కలెక్టర్ బస

ఎంజేపీ స్కూల్లో కలెక్టర్ బస

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎంజేపీ స్కూల్లో కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం రాత్రి బస చేశారు. అంతకుముందు వంట గదిలో స్టూడెంట్స్ కోసం వండిన వంటను పరిశీలించి, డైనింగ్ హాల్లో స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు.

 స్కూల్ సమస్యల వివరాలను స్థానిక ప్రిన్సిపల్ శారదను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్టూడెంట్స్ తో ముఖాముఖిలో కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని మంచిగా చదవాలన్నారు.