ఆదిలాబాద్, వెలుగు : గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ అర్జీలు స్వీకరించారు. 93 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవనించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మండల ప్రత్యేక అధికారులు ప్రతి పాఠశాలలను సందర్శించాలని, విద్యార్థుల హాజరు, మెనూ ప్రకారం భోజనం, వసతుల పై ఆరా తీయాలని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.