ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.3771 ప్రకటించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, మార్కెట్ యార్డులో రైతులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జొన్నల కొనుగోలు ఎకరానికి 8.65 క్వింటళ్ల పరిమితిపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. కొనుగోలు చేసే వ్యాపారస్తులు రైతులకు బిల్లులు అందించాలని, రిజిస్టర్ లో పూర్తి వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు.

రేపటి నుంచి భూభారతిపై అవగాహన కార్యక్రమాలు

భూ భారతి చట్టం అమలుపై ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భూ భారతి ఆర్వోఆర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. కొత్త చట్టంపై మండలాల్లో అవగాహన కల్పించాలన్నారు. 948 ఇందిరమ్య ఇండ్లకు మార్కింగ్ చేయగా, వాటిల్లో 100  మంది లబ్ధిదారులు బేస్​మెంట్ నిర్మాణం పూర్తిచేసుకున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: స్వచ్ఛంద సంస్థలు స్కూళ్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్​లో పింక్​షీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ​పాల్గొన్నారు. ఫౌండేషన్​ఆధ్వర్యంలో జిల్లాలోని 33 ప్రభుత్వ స్కూళ్లు, 7 కాలేజీల్లో విద్యార్థినులకు సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కలెక్టర్​ ప్రారంభించారు.

మూడేండ్లపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఒక్కో విద్యార్థికి రెండు నెలలకు సరిపడా ప్యాడ్స్​ఇస్తామని ఫౌండేషన్​ అధినేత అనిల్​గుప్తా తెలిపారు. అనంతరం కలెక్టరేట్​లో సంబంధిత స్కూళ్ల హెచ్​ఎంలు, కాలేజీల ప్రిన్సిపాల్స్​, కేజీబీవీ ఎస్​ఓలు, ఆశా వర్కర్లకు పలు సూచనలు చేశారు. ఫౌండేషన్ సెక్రటరీ శాలిని గుప్తా, డీఐవో గణేశ్ జాదవ్, డీఈవో శ్రీనివాస్, డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్,  ఐసీడీఎస్​పీడీ మిల్కా తదితరులు పాల్గొన్నారు.