
ఆదిలాబాద్, వెలుగు : ఇంద్రవెల్లి మండలం కేజీబీవీని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల స్క్రీనింగ్ పరీక్షలు , మధ్యాహ్నం భోజనం పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించి అన్నం రుచి చూశారు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ టెస్ట్ ను ఇంద్రవెల్లి కేజీబీవీ నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్బీఎస్కే టీం ద్వారా 45 రకాల పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.