ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని ఐటీడీఏ గిరిజన ఆశ్రమ పాఠశాల్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్మీటింగ్హాల్లో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పెండింగ్ పనులు, మరమ్మతులు ఏమైన ఉంటే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.