రైస్ మిల్లర్ ఆస్తుల రికవరీకి నోటీసులు జారీ : రాజర్షి షా

రైస్ మిల్లర్ ఆస్తుల రికవరీకి నోటీసులు జారీ : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:  సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లర్ పైడి శ్రీధర్ గుప్తా  ఆస్తుల రికవరీకి చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. నర్సాపూర్ శ్రీ పాద ఇండస్ట్రీస్, కాగజ్ మద్దూరు శ్రీ శివ సాయి ఇండస్ట్రీస్, పెద్దచింతకుంట శ్రీ వేంకటేశ్వర ఇండస్ట్రీస్  2001--, 2022, 2022,--2023 వానాకాలం, యాసంగి సీజన్ లకు సంబంధించి  రూ.47,17,36,860 విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) గడువు ముగిసినప్పటికీ చెల్లించలేదన్నారు.

దీంతో తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద సంబంధిత రైస్ మిల్లర్ఆస్తులు జప్తు చేసేందుకు నోటీసులు  జారీచేశామని వెల్లడించారు.