టీయూడబ్ల్యూజే–ఐజేయూ డైరీ ఆవిష్కరణ

టీయూడబ్ల్యూజే–ఐజేయూ డైరీ ఆవిష్కరణ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందేలా చూడాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కన్వీనర్​ పి.దేవీదాస్, కోకన్వీనర్​ ఎం.రాజేశ్వర్ ​కలెక్టర్​ రాజర్షి షాను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. శుక్రవారం సంఘం నాయకులు కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్​ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

 ఈ సందర్భంగా సంఘం న్యూ ఇయర్ డైరీని  కలెక్టర్ ఆవిష్కరించారు. జర్నలిస్ట్​ జేఏసీ అధ్యక్షుడు దేవేందర్, సంఘం నాయకులు సూది నరేశ్, వినోద్, అస్మత్, రమాకాంత్, రాజేశ్, అరుణ్, రాజ్ కిరణ్, జగన్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.