పశువుల అక్రమ రవాణా అరికట్టాలి : కలెక్టర్​ రాజర్షి షా

  •    జిల్లా కలెక్టర్​ రాజర్షి షా 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్​రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై కలెక్టర్ ఛాంబర్​లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎక్కడా గోవధ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని  చెక్ పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్​ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ  జీవన్ రెడ్డి, ఆర్డీఓ జివాకార్ రెడ్డి,  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్, తహసీల్దార్లు, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

షెడ్యూల్డ్​కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​రాజర్షి షా సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు , వసతిగృహల వివరాలకు సంబంధించిన పంప్లీట్​లను కలెక్టర్ విడుదల చేశారు.  అడిషనల్​ కలెక్టర్లు శ్యామల దేవి, సునీత, జిల్లా షెడ్యూల్డ్  కులాల అభివృద్ధి అధికారి శంకర్, అధికారులు రాజలింగు, ఆయా శాఖల ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.