ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన డేటా ఎంట్రీపై కమిషనర్ ఖమర్ అహ్మద్‌తో సమీక్షించారు.
కుటుంబ ఫొటో ను ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని, ఈ నెల 11లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీఓ వినోద్ కుమార్, ఈడీఎమ్ రవీందర్, ఆపరేటర్స్, తదితరులు పాల్గొన్నారు.