
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ఆఫీస్లో రోడ్డు సేఫ్టీ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణకు బోర్డులు, సూచికలు, రేడియంతో చేసిన బోర్డులను ఏర్పాటు చేయాలని, హెల్మెట్‌పై మరింత అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు. మూలమలుపుల దగ్గర హెచ్చరికల బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
డ్రగ్స్రవాణాపై నిఘా పెట్టాలి
డ్రగ్స్రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్పట్ల ప్రత్యేక నిఘా పెట్టాలని స్కూల్, కాలేజ్ పిల్లలను తరచుగా గమనించాలన్నారు. కిరాణ, మెడికల్ షాపులను తరచుగా చెక్ చేయాలన్నారు. గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రమేశ్, ఏఎస్పీ మహేందర్, డీఈవో రాధాకిషన్, డీఐఈవో సత్యనారాయణ, జిల్లా ఎక్సైజ్సూపరింటెండెంట్రజాక్, డీఏవో గోవింద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
సిద్దిపేట రూరల్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఇన్‌చార్జి డీటీఓ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్‌లో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాల పై వాహనదారులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ జనార్దన్ రెడ్డి, ఏఎంవీఐ శ్యామ్, రిచర్ట్ సన్, కానిస్టేబుల్ రవీందర్, జయలక్ష్మి, విక్టోరియా, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.