పకడ్బందీగా కౌంటింగ్​ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జూన్​4న జరిగే లోక్​సభ ఎన్నికల కౌటింగ్ ​ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అడిషనల్​కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పరిశీలించారు. కౌంటింగ్​ కేంద్రం పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఇతర సిబ్బంది కోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సెంటర్ల వద్ద తాగునీరు, టాయిలెట్స్, తదితర సదుపాయాలు, మీడియా పాయింట్, సైన్ బోర్డ్స్ , సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. 

అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​ల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్​ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.