ఆదిలాబాద్టౌన్(జైనథ్), వెలుగు: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్రాజర్షి షా తెలిపారు. జైనథ్మండలంలోని రైతు వేదికలో బుధవారం సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరయ్యారు.
నవంబర్6 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. 1వ తేదీ నుంచి 3 వరకు ఇండ్ల జాబితా సేకరించి ఇంటింటికి స్టిక్కర్స్ అతికించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్శ్యాంసుందర్, ఎంపీడీవో వెంకటరాజు, సూపర్ వైజర్స్, ట్రైనర్లు, ఎన్యుమారెటర్లు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెంపొందించాలి
పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే చదివించడం అలవాటు చేయిస్తే వారు స్వతంత్ర పాఠకులుగా ఎదుగుతారని కలెక్టర్రాజర్షి షా అన్నారు. జైనథ్మండలంలోని దీపాయిగూడ మండల ప్రైమరీ స్కూల్లో రూమ్ టు రీడ్ ఇండియా ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని కలెక్టర్ ప్రారంభించారు. లైబ్రరీలో విద్యార్ధులతో పాఠాలు చదివించారు. రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్, యూఎస్ఏఐడీ సహకారంతో జిల్లాలో ప్రతి మండలానికి ఒక మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.