ఆదిలాబాద్,వెలుగు : పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం పరీక్షల ప్రిపరేషన్ పై శుక్రవారం కేజీబీవీ, హై స్కూల్, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిలో ఉంటారని, ఈ నేపథ్యంలో వారికి మనో నిబ్బరం కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైనే ఉంటుందని పేర్కొన్నారు.
వచ్చే రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండి విద్యార్ధులకు అవగాహన కల్పించి మంచి మార్కులు సాధించేలా కృషి చేయాలని సూచించారు. గైర్హాజరైన వారి పై ప్రత్యేక దృష్టి సారించి, హోమ్ విజిట్ చేయాలని, ఏబీసీడీలు గా వర్గీకరించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.