పారిశ్రామికవేత్తలు సాయం అందించాలె : రాజర్షి షా

పారిశ్రామికవేత్తలు సాయం అందించాలె : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: పారిశ్రామిక వేత్తలు తమ వంతుగా సమాజానికి సాయం అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం మెదక్​ కలెక్టర్​ ఆఫీసులో జిల్లా పారిశ్రామికవేత్తల తో సీఎస్​ఆర్​ ఫండ్స్​పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ​ (సీఎస్​ఆర్​) ఫండ్స్ తో సహకరించాలన్నారు.

ప్రతి పారిశ్రామిక కేంద్రం నుంచి 2 శాతం నిధులు సీఎస్​ఆర్​కు కేటాయించాలని సూచించారు. వీటిని విద్యా , వైద్యం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్,  జిల్లా పారిశ్రామిక అధికారి కృష్ణమూర్తి , కాలుష్య నియంత్రణ అధికారి కుమార్ పాఠక్ , అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.