ఆదిలాబాద్, వెలుగు: టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రులు నెల రోజుల పాటు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్ల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఉదయం 5 గంటల కు నిద్ర లేపి చదువుకోవాలని చెప్పాలని, పరీక్షలు అయ్యేంతవరకు ఇంట్లో పనులు, వేరే ఇతర పనులు చెప్పకుండా కేవలం చదువు పైనే దృష్టి సారించేలా చూడాలని సూచించారు. టీవీ, మొబైల్కు దూరంగా ఉంచాలన్నారు. విద్యార్థులు ఇంట్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేననని, వారు మంచి మార్కులు సాధించేలా చూడాలన్నారు. మొత్తం 4045 మంది తల్లిదండ్రులు ఈ టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.